ఈ సంక్రాంతికి కోస్తా జిల్లాల్లో కోడి తొడకొట్టింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల బరులే కనిపించాయి. అన్నింటికీ వైసీపీ రంగులు వేయడంతో పోలీసులుకూడా వాటి వైపు చూడలేదు. కోట్లకుకోట్లు జూదం రూపంలో చేతులు మారాయి. గుండాట, పేకాటలు కూడా జోరుగా సాగాయి. సంక్రాంతి అంటే కోడి పందాలన్నట్లుగా కోస్తా జిల్లాల్లో విరివిగా బరులను ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల్లో ఊరూవాడా బరులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా.. వైసీపీ రంగులేశారు. అంటే.. అవి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన బరులని.. అంటే.. లైసెన్స్ ఉన్నట్లేనని .. పోలీసులు అటు వైపు రాకూడదని అర్థం. దానికి తగ్గట్లుగానే పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆ బరుల వద్ద .. ఇష్టం వచ్చినట్లుగా కోట్లకు కోట్లు పందేలు నడిచాయి. పేకాట క్లబ్‌ల నిర్వహణలో రాటుదేలిపోయిన నేతలు ఎక్కువగా ఉండటంతో… పందెల నిర్వహణ సులువుగా మారిపోతోంది.
డబ్బులకు టోకెన్లు ఇవ్వడం.. అప్పటికప్పుడు బంగారం కుదువ పెట్టుకోవడం… కావాలంటే ఆస్తులు తనఖా పెట్టుకోవడం కోసం కూడా ఏర్పాట్లు చేసేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు.. తరలి వస్తున్నారు. ఒక్కో జిల్లాలో రోజుకు యాబై కోట్ల వరకూ చేతులు మారుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. జూదంలో గెలిచేవాళ్లు ఉండరు… గెలిచినా ఓడిపోయేవారే ఉంటారు. కానీ మధ్యవర్తులు.. బరులు నిర్వహించేవారే పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు. కోడి పందెలకు తోడు.. గుండాట.. పేకాట కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. జూదరులు ఏది ఇష్టమైతే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
కోడిపందేలతో పాటు పేకాట, గుండాట కూడా నడుస్తూండటం.. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతూండటంతో.. గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పందాలలో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ లో వివాదం కారణంగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు గంట సేపు దాడులు నిర్వహించడంతో కొన్ని కోట్ల భయానక వాతావరణం ఏర్పడుతోంది. పోలీసులు మాత్రం ఆ వైపు చూడటం లేదు. పండుగ సందర్భంగా.. మూడు రోజులు పట్టించుకోమని.. తర్వాత మాత్రం తాట తీస్తామని పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.