సోనూసూద్ ఇప్పుడు ఓ రియల్ హీరో. తనకి విగ్రహాలు పెట్టేస్తున్నారు. గుళ్లో ఫొటో తగిలించి పూజలూ చేసేస్తున్నారు. ఓ చిరు వ్యాపారి.. తన బడ్డీకి…. సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. ఆ అభిమానంతో.. సోనూసూద్ స్వయంగా వెళ్లి, ఆ వ్యాపారి భుజం తట్టి వచ్చాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డకూ సోనూసూద్ పేరు పెట్టేశారు.
ఖమ్మం జిల్లా ముష్టికుంట్ల గ్రామంలోని పండగరాజు, మంగమ్మ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ఆ బాబుకి సోనూసూద్ అని నామకరణం చేశారు. ఈ నామకరణ మహోత్సవానికి సోనూసూద్ కీ ఆహ్వానం అందింది. సోనూ కూడా.. ఖమ్మం వెళ్లి, ఆశీర్వాదాలు అందిద్దామని భావిస్తున్నాడు. ఫిబ్రవరి 2న సోనూసూద్ ఖమ్మం వెళ్లే ఛాన్సుంది. ఇదంతా సోనూకి ఉన్న క్రేజా..? లేదంటే సోనూ పేరు వాడుకుని.. వాళ్లేమైనా పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అనేది బోలెడన్ని ప్రశ్నలకు తావిస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈమధ్య సోనూ పేరు మార్మోగినంత ఏ నటుడి పేరూ… వినిపించలేదు. సోనూ.. క్రేజ్ అలాంటిది.