ఎన్నో ఆశలు పెట్టుకున్న `నారప్ప` వెంకీని బాగా నిరాశ పరిచింది. నిజానికి ఈ సినిమా కోసం వెంకీ బాగానే కష్టపడ్డాడు. కానీ ఫలితం రాలేదు. `దృశ్యమ్ 2` కూడా ఓటీటీకే వెళ్లిపోతోంది. ఓటీటీ రిజల్ట్ పట్ల ఎలాంటి ఆసక్తి లేని వెంకీ – ఈ సినిమానీ పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్. ఇప్పుడు తన చేతిలో `ఎఫ్ 3` ఒకటే ఉంది. ఈలోగా తన దగ్గరకు వస్తున్న కొత్త కథల్ని సున్నితంగా తిప్పి పంపించేస్తున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 వరకూ మరో సినిమాపై ఫోకస్ చేయకూడదని వెంకీ భావిస్తున్నాడట. నిజానికి వెంకీ కోసం ఓ రీమేక్ కథ సిద్ధంగా ఉంది. అదే.. `విక్రమ్ – వేద`. ఈసినిమా పై ఎప్పటి నుంచో వెంకీ ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ తనకు ఈమధ్య రీమేకులు పెద్దగా కలసి రావడం లేదన్న ఫీలింగ్ తో ఈ సినిమా సైతం వెంకీ పక్కన పెట్టాడని తెలుస్తోంది. వెంకీ కోసం తరుణ్ భాస్కర్ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే…. వెంకీ చేయబోయే సినిమా అదే. కానీ ఆ కథ ఎంతకీ సెట్ అవ్వడం లేదు. దాంతో కొన్నాళ్లు వెంకటేష్ కొత్త కథలు వినకూడదని డిసైడ్ అయినట్టు టాక్.