ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ సీజన్. అయితే అందరికీ ఓ టెన్షన్ ఉంది. అదే ధరలు. పెరిగిపోయిన ధరలతో పండుగ చేసుకోవడం చాలా పెద్ద టెన్షన్ అయిపోయింది. కానీ ఒక్క నియోజవర్గంలోకి వారికి మాత్రం బిందాస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ నియోజకవర్గమే హుజురాబాద్. ఏపీలోని బద్వేల్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నా అక్కడ ఓటర్లను పట్టించుకునేవారు లేరు కానీ హుజురాబాద్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. పండుగలు రాక ముందే సామాజికవర్గాల వారీగా విందు భోజనాలు పెట్టేసిన పార్టీలు ఇప్పుడు ఓటర్లకు పండుగ మర్యాదలు చేస్తున్నాయి.
ప్రచారం జోరు తగ్గించినా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో మాత్రం లోటు రానీయడం లేదు. వార్డులు, గ్రామల లెక్కలు పెట్టుకుని మరీ మేకలు, గొర్రెల్ని మాత్రమే కాదు కోళ్లను కూడా ఇంటికే పంపుతున్నారు. ప్రత్యేకంగా ఆయా ఏరియాల్లోని మటన్, చికెట్ షాపులతో ఒప్పందాలు చేసుకుని ఓటర్లకు పంపుతున్నారు. న్నిచోట్ల నాయకులే ప్రత్యేక విందులు వినోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలంటే ఓటర్లను మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా సంతృప్తి పరిచాలి. దానికి తగ్గట్లుగా అన్ని పార్టీలు తమ పార్టీ నేతలకు అన్ని రకాలుగా పండుగ చేసేశారు.
దీపావళి పండుగకు ముందే ఓటింగ్ జరిగిపోనుంది. అయితే దీపావళి కోసం కూడా ఓటర్లు, నేతలకు తమ వంతు సాయం చేస్తున్నారు. దసరా ముగియడంతో ప్రచారం ఊపందుకోనుంది. సోమవారం నుంచి ఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఉపఎన్నిక జరగుతున్న బద్వేలులో మాత్రం ఎలాంటి హడావుడి లేదు.