దేశంలో నిన్నటికి వంద కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను ప్రజలకు పంపిణీ చేశారు. దీనికి గుర్తుగా నిన్నటి నుంచే ఓ గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున ఉదయమే మోడీ తెర మీదకు వచ్చేశారు. ఉదయం పది గంటలకు జాతినుద్దేంచి ప్రసంగిస్తారని ప్రకటించడంతో చాలా మంది భయపడ్డారు. ఓ నోట్ల రద్దు.. మరో లాక్ డౌన్ తరహా నిర్ణయాలు గుర్తుకొచ్చాయి. కానీ ఈ సారి ఆయన కేవలం వ్యాక్సిన్ క్రెడిట్ కోసమే స్పీచ్ ఇచ్చారని తేలిపోయింది. వ్యాక్సిన్ల విజయం దేశ ప్రజలదన్నారు.
కరోనా మహమ్మారి వచ్చినప్పుడు.. అసలు భారత్ వ్యాక్సిన్ కనుగొట్టుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇవాళ ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూశాం. పేదలు, ధనికులు ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.పంచ దేశాలు భారత్‌ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇది ఎలా సాధించారా అని చర్చించుకుంటున్నాయన్నారు. వ్యాక్సినేషన్లో భారత్ స్పీడు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి.
అసలు ఇది ఎలా సాధ్యమని అడిగాయన్నాకుయ ఇది భారత ఐకమత్య శక్తికి నిదర్శనమని వారికి తెలియదు. ఇప్పటివరకు ఆ దేశం ఇది తయారు చేసింది, ఈ దేశం ఇది తయారు చేసింది అని విన్నాం. కానీ ఇక ఏది చూసినా ‘మేడ్ ఇన్ ఇండియా’ అని ఉండటం చూస్తున్నాం.. . ఇది భారత్ సాధించిన ఘనత అని సంతోషం వ్యక్తం చేశారు.