ఆంధ్రప్రదేశ్‌లో బూతులు, నీచమైన భాషతో ట్వీట్లు పెట్టే వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విజయసాయిరెడ్డి కూడా .. రాజకీయ విమర్శలు ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నారు. విశాఖలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన జనాగ్రహ దీక్షకు సంఘిభావం చెప్పేందుకు వచ్చిన ఆయన విమర్శలు ప్రజాస్వామ్య సహితంగా ఉండాలని.. అసహ్యకరమైన భాష వాడకూడదని సూక్తులు చెప్పారు. టీడీపీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను అసభ్యకరంగా దూషించడం శోచనీయమని బాధపడ్డారు. లోకేష్ కూడా దారుణంగా ట్వీట్లు పెడుతున్నారని అన్నారు.
విజయసాయిరెడ్డి మాటలను వైసీపీ నేతలు కూడా ఆయన వైపు అలా చూస్తూండిపోయారు. సభ్యత, సంస్కారం లేని నాయకుడిగా ఇప్పటి వరకూఆయనకు పేరు ఉంది. ట్విట్టర్లో కానీ బయట కానీ ఆయన మాట్లాడే మాటలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ట్వీట్ పెట్టినా కొన్ని వందల మంది ఆయన తీరును తప్పు పడుతూ కామెంట్లు పెడుతూ ఉంటారు. చివరికి చంద్రబాబునాయుడు పుట్టిన రోజున కూడా శుభాకాంక్షల పేరుతో వ్యక్తిగత లోపాలను ఎత్తి చూపించి ట్వీట్లు పెట్టే కుసంస్కారం విజయసాయిరెడ్డి సొంతం. ఆయన కూడా ఇప్పుడు నీతులు చెప్పడానికి బయలుదేరి రావడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఏమైందో కానీ ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి మీడియా ముందుకు తక్కువగా వస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నారు కానీ ఇతురలను తిట్టడం లేదు. వైసీపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందని అందుకే ఆయన ఇలా చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా కానీ.. దారుణమైనభాషకు ట్విట్టర్లో ఓ బ్రాండ్‌గా మారిన విజయసాయిరెడ్డి నీతులు ప్రారంభించడం మాత్రం హైలెట్‌గా మారింది.