రాధే శ్యామ్ కథేమిటి? అందులో ప్రభాస్ పాత్రెలా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకూ సమాధానం దొరకలేదు. బయట రకరకాల రూమర్లు ప్రచారం లో ఉన్నా టీమ్ స్పందించలేదు. అయితే ఇప్పుడు ఓ టీజర్ విడుదల చేసింది. `రాధేశ్యామ్` లో విక్రమాదిత్యని పరిచయం చేస్తూ.
ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ ఒకటి విడుదలచేశారు. విక్రమాదిత్యగా… ప్రభాస్ ని తెరపైకి తీసుకొచ్చి… తన వాయిస్ ఓవర్ లో కథపై కాస్త క్లూ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఐ నో యూ..
ఐ వోంట్ టెల్ యూ..
ఐ కెన్ ఫీల్ యువర్ హాట్ బ్రేక్
బట్ ఐ వోన్ట్ టెల్ యూ.. అంటూ విక్రమాదిత్యగా ప్రభాస్ తెరపైకొచ్చాడు.
పుట్టుక, భవిష్యత్తు, పరాజయాలు, చావు అన్నీ తెలిసిన ఓ వ్యక్తి కథ ఇది. అంటే.. తనకు తలరాతలు చదవడం వచ్చన్నమాట. ఓవరాల్ గా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఇది. 80 సెకన్ల టీజర్ లో ప్రభాస్ ని మాత్రమే చూపించారు. కాకపోతే.. లెక్కలేనన్ని షాట్స్. అవన్నీ.. ఈ కథకు సింబాలిక్ గా అనిపిస్తున్నాయి. కాలం, ప్రేమ, జాతకాలు వీటిపై ఈ కథ సాగబోతోంది. అయితే వీటన్నింటినీ ఒకే కథలోకి ఎలా తీసుకొచ్చాడన్నది ఆసక్తికరం. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని టీజర్లో చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.