జగన్ అక్రమాస్తుల కేసులను వేగంగా విచారించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని గతంలోసుప్రీంకోర్టు ఆదేశించిందని తన పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందోలేదో ఇంకా స్పష్టత లేదు. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది.తాను పిటిషన్ దాఖలు చేసినట్లుగా మాత్రం రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపారు.
ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఓ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని.. వారి బెయిళ్లను రద్దు చేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్ విచారణకు రావడం లేదు. బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టులో ఉండటంతో .. విచారణ వేగం చేయాలన్న విజ్ఞప్తితో సుప్రీంకోర్టుకు రఘురామ రాజు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఎన్నిసార్లు పిటిషన్లు వేసినా రఘురామకృష్ణరాజు జగన్ కు పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు వేయడం లేదని.. ఆయన మచ్చ లేకుండా బయటకు రావాలని తాను పిటిషన్లు వేస్తున్నానని చెబుతూ ఉంటారు.