ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అదీ వరల్డ్ కప్‌లో అంటే మామూలు ఫీవర్ రాదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ – పాక్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 రౌండ్లో భారత్ ,పాకిస్తాన్ జట్లు గ్రూపు-2లో ఉన్నాయి. అప్ఘానిస్తాన్, న్యూజీల్యాండ్, స్కాట్లాండ్, నమీబియా ఇతర జట్లు. సూపర్-12 రౌండ్లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి గ్రూపు-1లోని శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తొలి మ్యాచ్ ఆడగా.. రాత్రి ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్‌లో ఇరు జట్లు 5సార్లు తలపడగా.. ఐదింటిలోనూ టీమ్ ఇండియానే విజయం సాధించింది. 2007లో పొట్టి ప్రపంచకప్‌లో రెండు సార్లు ఇరు జట్లు తలపడ్జాయి. ఓ మ్యాచ్‌లో బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. ఫైనల్లో భారత్ గెలుపు ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఆ తర్వాత టీ ట్వంటి వరల్డ్‌కప్‌లో భారత్ చాంపియన్ కాకపోయినా పాకిస్తాన్‌ను ప్రతీ సారి ఓడిచింది.
ఇటీవల టీ20 క్రికెట్లో పాకిస్తాన్ వరుస విజయాలు సాధిస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీస్‌లను కైవసం చేసుకుంది.టీమ్ ఇండియా పటిష్టంగానే ఉంది. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన వారే జట్టులో ఉండటం అదనపు బలం. ఇంకోవైపు, వార్మప్ మ్యాచ్‌ల్లో మేటి జట్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లను చిత్తు చేసి భారత్ ఆత్మవిశ్వాసంలో ఉంది. టీమ్ ఇండియాకు మెంటార్‌గా ధోనీ ఉండటం అదనపు బలం. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించిన అనుభవంతోపాటు.. టీ20 క్రికెట్లో ధోనీకి మంచి వ్యూహరచన ఉంది.
రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే… ఇరు జట్లకూ ఒత్తిడే ప్రధాన ప్రత్యర్థి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఒత్తిడిని అధిగమించిన వారే అంతిమంగావిజేతగా నిలుస్తారు.