భరించలేనంతగా పెంచి ఆ సెగ ప్రభుత్వానికి తగులుతుందని తేలిన తర్వాత కాస్త ఉపశమనం ఇచ్చింది కేంద్రం. పెట్రోల్‌పై రూ. ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గించింది. ఇప్పుడు అందరి చూపు రాష్ట్రాలపై పడింది. రేటు పెరిగిన కొద్దీ ఆదాయాన్ని ఖజానాలో వేసుకుంటున్న రాష్ట్రాలు ప్రజలపై భారాన్ని కేంద్రంతో పాటు తగ్గించే ప్రయత్నం చేస్తాయని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. పెట్రోల్ లీటర్ రూ. 115 ఉంటే అందులో కేంద్ర ఎక్సయిజ్ పన్నులు రూ. 40 వరకూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధించి వ్యాట్, వాటిపై స్సెస్లు మరో నలభై రూపాయల వరకూ ఉంటాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాల్లోని పన్నుల రేట్లను బట్టి మారుతూ ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ పై 35 శాతానికిపైగా వ్యాట్ విధిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో రూ. నాలుగు అదనపు పన్ను వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే కనీసం లీటర్‌కు రూ. ఆరు ఎక్కువ ఉంటుంది. తెలంగాణతో పోలిస్తే రూ. నాలుగున్నర ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నుల భారం తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పెట్రో ధరల కారణంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడి జీవనం అతలాకుతలం అవుతోంది. వీటిపై కంట్రోల్ తప్పితే ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే ప్రభుత్వాలు తట్టు కోలేని పరిస్థితి వస్తుంది. అయితే పన్నులు బాదుకోవడం తప్పించే తగ్గించే ఆలోచనను ప్రభుత్వాలు ఎప్పుడూ చేయడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కనికరించకపోతే ప్రజల ఆగ్రహం.. అసంతృప్తి ప్రజల్లో కనిపించే అవకాశం ఉంది.