సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్ట్ నుండి బదిలీ అయి ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న సజ్జనార్‌కు రోజూ మీడియాలో పబ్లిసిటీ పొందాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఆర్టీసీకి ప్రచారం పేరుతో రోజుకో ఫీట్ చేస్తున్నారు. దాన్ని తన సొంత పేరుతో ప్రచారం చేసుకుంటున్నారు. మీడియాలో కూడా సజ్జనార్ ఇలా చేశారు.. అలా చేశారు అని వచ్చేలా చూసుకుంటున్నారు. తాజాగా ఆయన తమ గ్రామానికి బస్సు కావాలంటూ సుప్రీంకోర్టు సీజేకి ఓ స్టూడెంట్ లేఖ రాసింది. దాన్ని సీజేఐ ఆఫీస్ .. ఆర్టీసీ ఆఫీసర్లకు పంపింది. వెంటనే గ్రామానికి బస్సు ఏర్పాటు చేసిన సజ్జనార్ తన పనికి భారీ ఎత్తున పబ్లిసిటీ వచ్చేలా చూసుకున్నారు.
తర్వాత ఆ బాలికతో ఫోన్లో మాట్లాడి దాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని కూడా సీజేఐకి ట్యాగ్ చేశారు. సీజేఐతో పాటు అన్ని ప్రముఖ మీడియా సంస్థలకూ ట్యాగ్ చేశారు. ఇదొక్కటే కాదు.. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి.. ఆ సంస్థను ఎక్కడకో తీసుకెళ్లిపోతానన్నట్లుగా ప్రచారం చేసేసుకుంటున్నారు. కొన్ని మీమ్స్‌తో రోజూ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆర్టీసీ పరిస్థితిని నిజంగా మెరుగు పర్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారో లేదో కానీ సజ్జనార్‌కు మాత్రం మీడియాలో పబ్లిసిటీ మాత్రం తగ్గడం లేదన్న గుసగుసలు అన్ని చోట్లా వినిపిస్తున్నాయి. అయినా ఈ రోజుల్లో సైలెంట్‌గా పని చేస్తే ఎవరు గుర్తిస్తారు.. ఎంత ప్రచారం చేసుకుంటే అంత గొప్పగా పని చేస్తున్నట్లు మరి. ఆ లెక్కన సజ్జనార్ అద్భుతంగా పని చేస్తున్నట్లేనని కొంత మంది.. ఇలాంటి పబ్లిసిటీ పొందలేని ఆఫీసర్లు అంతర్గతంగా నిష్టూరమాడుతూనే ఉంటారు.