కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేకాధికారిగా వచ్చిన లోకేశ్వర వర్మ అనే అధికారిని చూసి టీడీపీకి కింద నుంచి పైదాకా కాలిపోతోంది. ఎందుకంటే ఆయన మంత్రి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తూంటారు. ఆయన ఎక్కువ కాలం పుంగనూరులోనే ఉంటారు. ఇప్పుడు కూడా పుంగనూరు మున్సిపల్ కమిషనరే. అయితే కుప్పంకు ఎన్నికల ప్రత్యేకాధికారిగా వెళ్లారు. పుంగనూరు స్థానిక ఎన్నికల్లో ఆయన వేసిన వేషాలకు ఇప్పటికే ఆయనపై నషాళానికి అంటిన టీడీపీ కోపం ఇప్పుడు కుప్పంలోనూ ఆయన కనిపించడంతో కంట్రోల్ తప్పిపోయింది.
ఆయన వైసీపీ నేతలతో అంట కాగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని ఆయన ఎన్నికల విధుల్లో ఉండకూడదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకే ఆ అధికారిని అక్కడ నియమించారని తక్షణం ఆ లోకేశ్వర శర్మను కుప్పం పంపేయాలని పిటిషన్లో కోరారు. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
కుప్పంలో గెలవడాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక సవాల్ గా తీసుకున్నారు. అక్కడ మంత్రుల్ని ఉపముఖ్యమంత్రుల్ని రంగంలోకి దింపి ప్రచారం చేసేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబును అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఓ సొంత పార్టీ జడ్పీటీసీని ఐదున్నర కోట్లకు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబును తీసుకొచ్చి తమిళంలో చంద్రబాబునూ బూతులు తిట్టించారు. ఆయనకు తెలుగు అంత స్ఫష్టంగా రాదు. అందుకే తమిళంలో తిట్టించారు. కానీ బెంగళూరు శివారులో ఉండే కుప్పంలో ఎక్కువ మందికి తమిళం రాదు.