శాసనమండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోని కారణంగా ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. రాజధాని బిల్లులను మండలి సెలక్ట్ కమిటీకి పంపడంతో 2020 జనవరిలో సీఎం జగన్ .. మండలి రద్దు చేయాలని నిర్ణయించారు. వెంటనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి అసంబ్లీలో రెండింట మూడు వంతుల మెజార్టీతో ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. తక్షణం మండలిని రద్దు చేయాలని కోరారు.
తీర్మానం సందర్భంగా సీఎం జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏడాదిన్నరలో పూర్తి మెజార్టీ వస్తుందని తెలిసి కూడా రద్దు చేస్తున్నామని.. శానమండలి వల్ల ప్రజాదనం వృధా మినహా ఎలాంటి ఉపయోగం లేదని ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మండలి రద్దుపై వెనక్కి తగ్గారు. ఈ మేరకు విడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. శాసనమండలిలో ఖాళీ అవుతున్న ప్రతి ఎమ్మెల్సీకి వైఎస్ఆర్సీపీ సభ్యులే నామినేట్ అవుతున్నారు. గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఇలా ప్రతి స్థానం వైఎస్ఆర్సీపీకే దక్కుతోంది. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలకు పదవులు దక్కుతున్నాయి.
అయితే శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులను నామినేట్ చేయడం…. ఎెన్నికల్లో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో జగన్ శాససనభలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారని… శాసనమండలి రద్దుపై వెనక్కి తగ్గబోమని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అదే పనిగా చెబుతున్నారు. కానీ తమకు పూర్తి మెజార్టీ వచ్చే సిరికి అందరూ అభిప్రాయాలు మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోవడం.. మళ్లీ వెనక్కి తీసుకోవడం కామన్‌గా మారిపోయింది. ఆ జాబితాలో మండలి రద్దు కూడా చేరిపోయింది.