తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పెట్టుకున్న దరఖాస్తుపై స్పందించలేదని .. ధియేటర్ యాజమన్యాలు హైకోర్టుకు వెళ్లారు. మూడు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు రూ.యాభై వరకూ టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్ల గరిష్ట ధరలపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇంత వరకూ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు.
దీంతో తుది నిర్ణయం తీసుకోలేదని, అప్పటి వరకు తాము ప్రతిపాదించిన టికెట్ల ధరలతో థియేటర్ల నిర్వహణకు అనుమతించాలని యాజమాన్యాలు కోరాయి. వాదనలు విన్న హైకోర్టు.. థియేటర్ల అభ్యర్థనను అంగీకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధరలపై అధికారులు తుది నిర్ణయం తీసుకునే వరకు యాజమాన్యాలు కోరిన ధరలతో థియేటర్లను నిర్వహించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, భీమ్లానాయక్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు సినిమాల రేట్లను పెంచే అవకాశం ఉంది. మరో వైపు బెనిఫిట్ షోలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బాలకృష్ణ సినిమా అఖండ బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అధిక రేట్లకు టిక్కెట్లు అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చింది. ఏపీలో ధియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లలేదు. ఇక్కడ వచ్చిన తీర్పుతో అక్కడ కూడా యాజమాన్యాలు కోర్టుకెళ్తాయేమో చూడాలి..!