తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్యే స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఓటర్లందర్నీ క్యాంపులకు తీసుకెళ్లిన టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ తీసుకు వచ్చారు. అక్కడ రిసార్టుల్లో విడిది ఏర్పాటుచేసి.. వ్యూహాత్మకంగా ఒక్కో సమయంలో ఓటింగ్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి గురువారం రాత్రి అందర్ని ఓటింగ్ జరిగే జిల్లాలకు తరలించాలని అనుకున్నారు. కానీ మనసు మార్చేసుకున్నారు.
సాయంత్రం వరకు పోలింగ్ గడువు ఉంటుంది కాబట్టి … హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు ఎంత జర్నీ అని లెక్కలేసుకుని పోలింగ్ గడువు ముగియడానికి.. ఓ మూడు నాలుగు గంటల ముందు అక్కడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసారు. దీంతో రాష్ట్రంలో ఏ మూలకూ ఉన్న పోలింగ్ కేంద్రానికైనా ఏడు నుండి 8 గంటల వరకు గమ్య స్థానానాకి చేరే అవకాశం ఉన్నందున అదే అంచనాతో వారిని రిసార్ట్స్ నుండి బయటకు పంపిస్తున్నారు. ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్న బస్సుల్ని బయటకు కదిలించారు.
ఇప్పటికే టీఆర్ఎస్ హైకమాండ్‌కు తమ మీద ఎందుకింత అపనమ్మకం అని ఎక్కువ మంది ఓటర్లు ఫీలవుతున్నారు. అయితే రాజకీయ పరిస్థితుల్లో ఎవరినీ నమ్మలేకపోతున్న టీఆర్ఎస్… అనేక సమస్యలు ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్నీ నమ్మలేకపోతున్నారు. కోపంతో వేరే వారికి ఓటేస్తారేమోనని కంగారు పడుతున్నారు. ఈ పరిస్థితి రావడం టీఆర్ఎస్ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.