చిత్తూరు జిల్లా కురబల కోటకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం సాయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రూ. కోటి తో పాటు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆ తర్వాతి రోజే ఏపీ సర్కార్ సాయం పంపిణీ చేసింది. అయితే ఉద్యోగం సంగతి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా వ్యక్తిగతంగా గుంట భూమి ఇస్తామని ప్రకటించారు. గతంలో ఓ సామాజికవర్గానికి చెందిన సైనికులు చనిపోతే భారీ పరిహార ఇచ్చారని.. అదే ఇతర వర్గాలకు చెందిన వారు చనిపోతే పట్టించుకోలేదన్న విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి.
ఈనేపధ్యంలో బాగా ఆలోచించి… అందరికీ ఇచ్చినట్లుగానే యాభై లక్షలు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు సాయితేజ మృతదేహా్న్ని గుర్తించడంలో ఆలస్యం కావడంతో ఇంత వరకూ స్వగ్రాం తీసుకురాలేకపోయారు. ఆదివారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.