తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లూప్ హోల్స్ అన్నింటినీ కేంద్రం సేకరించిందని.. వచ్చే ఏడాది నుంచి ఆట మొదలు పెడుతుందని కొత్తపలుకులో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే చెప్పిన వెంటనే బీజేపీ నేతలు.. ఈ టెంపోను మెయిన్‌టెయిన్ చేయడానికి తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌పై విరుచుకుపడటానికి రెండు అడుగులు ముందే ఉంే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ అంశాన్ని చురుగ్గా వాడుకున్నారు. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించిందని .. రానున్న రోజుల్లో సంచలనాలు చూడబోతున్నారని ప్రకటించేశారు.
ఈడీ నోటీసుల భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పరుగు పెట్టారని స్పష్టం చేశారు. అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తామంటున్నారని.. టచ్‌లో ఉన్నారని ప్రకటించేశారు. కేసీఆర్ మెడ మీద కత్తిపెట్టి ధాన్యం ఇవ్వబోమన్న లేఖ తీసుకున్నారంటున్న కేసీఆర్‌పైనా అర్వింద్ సెటైర్లు వేశారు. 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కేంద్రం పెట్టమన్న చోట ఎలా సంతకం పెట్టాడని ప్రశ్నించారు., కొన్నాళ్ల నుంచి ఓ వైపు టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..మరో వైపు అర్వింద్ కేసీఆర్‌ను జైలుకు పంపుడు ఖాయమని వరుసగా ప్రకటనలు చేసేవారు.
ఇప్పుడు బండి సంజయ్ కాస్తంత సంయమనం పాటిస్తున్నారు. కానీ అర్వింద్ మాత్రం మళ్లీ ప్రారభించారు. వారు చెప్పినట్లుగా ముందు ముందు సంచలనాలు ఉంటే మాత్రం రాజకీయం మారిపోవడం ఖాయమన్న అభిప్రాయం సహజంగానే వినిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్లోనూ ఈ అంశంపై టెన్షన్ కనిపిస్తోంది.