వంశపారంపర్య అర్చకునిగా ఉంటూ ప్రభుత్వంపై కుట్ర చేసి.. .. పింక్ డైమండ్ అని..పోటులో తవ్వకాలు అని తప్పుడు ప్రచారం చేసి శ్రీవారిని సైతం వివాదాస్పదం చేసిన రమణదీక్షితులు ఇప్పుడు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. నెలకో ట్వీట్ పెట్టి అన్యాయం జరిగిపోయిందని.. ఎవరూ న్యాయం చేయడం లేదని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే ఎంత దుర్భరమైన స్థితిలోకి వెళ్లిపోయారోనన్న జాలి ఆయనపై కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. వంశపార్యపర అర్చక వ్యవస్థను పరిరక్షించాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉన్నతాధికారి ఉల్లంఘించారని రమణదీక్షితులు మండిపడ్డారు. ఇక తరువాయి కోర్టును ఆశ్రయించడమేనా…? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసిన రమణ దీక్షితులు… దీనిపై సలహా ఇవ్వండంటూ సుబ్రహ్మణ్య స్వామిని ట్యాగ్ చేశారు.
వంశ పారంపర్య అర్చకులను టీటీడీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశపారంపర్య అర్చకులు జీవితాంతకం సేవల్లో ఉంటారు. వారికి రిటైర్మెంట్ ఉండదు. అయితే పర్మినెంట్ ఎంప్లాయీస్గా గుర్తించినట్లయితే.. వారికి రిటైర్మెంట్ ఉంటుంది. నిజానికి గత ప్రభుత్వంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కారణంగానే రమణ దీక్షితులు రిటైర్ అయ్యారు. ఆయన కుమారుడికి ప్రధాన అర్చకుడి పదవి లభించింది. నిజానికి ఆయనకు ఈ రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం టీటీడీ ఆలయంలో ఏదేదో జరిగిందని.. దానికి చంద్రబాబు, టీడీపీనే బాధ్యుడని ఆరోపణలు చేయడమే.
ఈ కారణంగా ఆయన తన వెనుక ఉన్న రాజకీయ బాసులతో తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రధాన అర్చక పదవి ఇస్తామని హామీ పొందారు. వారు పదవిలోకి వచ్చాక… ఉత్తర్వులు ఇవ్వడమే తప్ప..రమణదీక్షితులకు కనీసం ఆలయంలో విధుల్లో పాల్గొనే అవకాశం కూడాలేదు. చివరికి మల్లీ ఆయనను సాంకేతికంగా రిటైర్మెంట్ చేసేశారు. దీంతో ఆవేశపడిపోయి ఆయన… సుబ్రహ్మణస్వామికి ట్వీట్ చేశారు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి కనీసం లాయర్ కూడా కాదన్న విషయం అందరికీ తెలిసిపోయి.. ఆయనను కూడా ఎవరూపట్టించుకోవడం లేదు. తనకెవరైనా రాజ్యసభ సీటు ఇస్తారేమోనన్న ఆశతో చూస్తున్నారు. ఇక రమణదీక్షితులకేం చేస్తారు ?