సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలకడానికి ఏపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. చీఫ్ జస్టిస్ అయినతర్వాత తొలి సారి తిరుమల పర్యటనకు వస్తే కనీసం పట్టించుకోని అధికార యంత్రాగం ఈ సారి ప్రాణం పెట్టి మరీ స్వాగతాలు చెబుతోంది. ప్రభుత్వం తరపున అధికారికంగా.. కొన్ని వందల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి బొమ్మతో .. ఎన్వీ రమణకుస్వాగతం చెబుతూఫ్లెక్సీలే కనిపించాయి.
ఎన్వీ రమణ పర్యటన ఉన్న రోడ్లలో ఇతరులెవరూ ఫ్లెక్సీలు పెట్టచలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వాటితో ముంచేసింది. అత్యంత వినయంగా … స్వాగతం చెబుతున్నట్లుగా ప్రతీ దాంట్లోనూ జగన్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఒక్క సారిగాసీజే్ఐపై ఇంత అభిమానం ఎందుకు ఏర్పడిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ… పరిస్థితిలో మాత్రం స్పష్టమైన మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడం అనే సామెత.. ఆ ఫ్లెక్సీలను చూసిన వారంతా ఉదహరిస్తున్నారు.
సీజేఐ ఎన్వీ రమణపై లేనిపోని ఆరోపణలుచేసి.. ఆయన క్యారెక్టర్‌పై మచ్చ వేసి.. చివరికి సీజేఐ కాకుండా ఉన్నత స్థాయిలో కుట్ర చేసిన జగన్ ఇప్పుడు ఆయన పట్ల అభిమానం చూపుతున్నట్లుగా నటిస్తూండటాన్ని… రూ. లక్షలు ప్రజాధనం ఖర్చు పెట్టి.. ప్రభుత్వం తరపు అనవసర స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.