తెలంగాణ మంత్రులు తాడో పేడో తేల్చుకుంటామని వీర ప్రకటనలు చేసి.. చివరికి ఏమీ తేల్చుకోకుండానే వెనక్కి వచ్చారు. కేంద్రంతో యుద్ధమే అన్నట్లుగా వెళ్లారుకానీ.. అక్కడ పీయూష్ గోయల్ మీడియా ముందు చెడామడా తిట్టినా ఇక్కడ సెంటిమెంట్ రేపే ప్రయత్నం చేశారు కానీ అక్కడేమీ చేయలేకపోయారు. రెండు రోజుల్లో గోయల్ స్పష్టత ఇస్తామన్నారనిచెప్పి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఖాళీగా ఉన్న మంత్రులు చివరికి సర్దుకుని వెనక్కి వచ్చేశారు.
క్రిస్మమ్ కారణంగా.. పార్లమెంట్ సమావేశాలుముగిసిన కారణంగా మంత్రులు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరూ అందుబాటులోఉండే అవకాశం లేదు. పైగా తెలంగాణ మంత్రులురాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు. వారికి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్తితి లేదు. దీంతో వారంతా వెనక్కి తగ్గారు.ఇప్పుడు తెలంగాణ మంత్రులు తమను అవమానంచారని..రైతుల్ని చిన్నచూపు చూస్తున్నారని ప్రకనటలు చేసి..రాజకీయం చేయడానికి మాత్రం అవకాశం ఉంది.
అయితే ఈ సీజన్లో ఇంకా ధాన్యం తాము కొనుగోలుచేస్తామని.. కేంద్రం తీసుకోకపోతే మాత్రం తీసుకొచ్చి ఇండియా గేట్ ముందు పారబోస్తామన్న ఓ భీకరమైన ప్రకటన మాత్రం మంత్రులుచేశారు. మంత్రుల తీరును టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ముందుగాచెప్పినట్లుగా ఏదో ఒకటి తేల్చుకున్నతర్వాతేరావాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ వారు అప్పటికే్ బయలు దేరిపోయారు.