వరి ధాన్యం కొనుగోలు గొడవతో యుద్ధం ప్రకటించుకున్న బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సైన్స్ సిటీ మధ్యవర్తత్వం పని చేస్తోంది. రాజకీయాలు జరుగుతూంటాయి.. ఎన్నికలు వస్తూ.. పోతూంటాయి.. కానీ అభివృద్ధి ముఖ్యమని కేటీఆర్, కిషన్ రెడ్డి సంయుక్త రాగం వినిపిస్తున్నారు. దీనికి కారణం సైన్స్ సిటీ. కేంద్రం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పలు నగరాల్లో సైన్స్ సిటీలు, సైన్స్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్‌లు, డిజిటల్ ప్లానెటోరియాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వెంటనే కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంల మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక 0 పంపితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని లేఖలో చెప్పారు. దీనికి 25 నుంచి 30 ఎకరాల స్థలం అవసరం. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 232.70 కోట్లు కాగా కేంద్రం ప్రభుత్వం వాటా 60 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం భరించాలి. కిషన్ రెడ్డి లేఖకు కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.
ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని కలిపి నిర్వహించిన కేటీఆర్, కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి సైన్స్ సిటీ బాగా ఉపయోగపడుతోందన్నారు. దీంతో సైన్స్ సిటీ హైదరాబాద్‌కు కేటాయించడం ఖాయంగా చెప్పుకోవచ్చు. కోల్‌కతా, లక్నోల్లో ఇప్పటికే ఈ సైన్స్సిటీలు ఉన్నాయి. దక్షిణాదిలో ఒక్కటీ లేదు.. కొత్తగా అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్‌కు ఇచ్చే అవకాశం ఉంది.అయితే ఇక్కడా రాజకీయం చేసుకుంటే కష్టమే. అసలు ప్రతిపాదనలే పంపలేదని బీజేపీ.. పంపినా ఇవ్వలేదని టీఆర్ఎస్ పరస్పర ఆరోపణల రాజకీయం ముందు ముందుఉండదని … హైదరాబాద్‌కు సైన్స్ సిటీ ఇస్తారని ఆశిద్దాం..!