వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ అంశంలో మొదట వైసీపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసినా చివరికి అది రివర్స్ అయినట్లుగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని రోజూ హైలెట్ చేస్తోంది. ఇప్పటికి చంద్రబాబు కూడా కలసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వగా.. తాజాగా ఎంపీ కేశినేని నాని కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని కేశినేని డిమాండ్ చేశారు.
వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఓ సంపద అని ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ఎంపీగా వంగవీటి రాధా రక్షణ కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు. వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తూ కొందరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. మరో వైపు అసలు ఈ వివాదన్ని ముగించడానికి పోలీసుల ప్రయత్నిస్తున్నారు. వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
ఎలాంటి అనుమానాస్పద ఘటన జరగనప్పుడు కేసు ఎలా పెడతామని పోలీసులు చెబుతున్నారు. స్వయంగా మంత్రి కొడాలి నాని కూడా రెక్కీ జరిగిందని చెప్పారు.. అయితే పోలీసులు మాత్రం ఇప్పుడు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. వైసీపీ ఈ విషయంలో డిఫెన్స్‌లో పడిందని అనుకుటున్న టీడీపీ… ఈ అంశాన్ని మరితంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు.