ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానితో గంటి సేపు భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. తక్షణం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు మూడో తేదీ వచ్చినా సగం మంది ఉద్యోగులకు జీతాలు ప డలేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు కూడా పడలేదు. సామాజిక పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. ఈ తరుణంలో జగన్ ప్రధానంగా తాత్కాలికంగా అయినా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయమని జగన్ కోరినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆయన నిర్మలాసీతారామన్‌ను కలవాలని సూచించినట్లుగా చెబుతున్నారు.
ప్రధాని సూచనతో వెంటనే… జగన్ నిర్మలాసీతారామన్ నివాసానికి వెళ్లారు. ఇప్పటికే ప్రతి నెలా మొదట్లో.. చివర.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి … ఢిల్లీలో మకాం వేసి… నిర్మలా సీతారామన్‌తో భేటీ అయి.. తిరుపతి ప్రసాదాలు.., వెంకటేశ్వర విగ్రహాలు ఇస్తూ ఉంటారు. ఈ సారి అది వర్కవుట్ కాలేదు. దీంతో నేరుగా సీఎం జగనే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. వచ్చే మూడు నెలల కాలానికి రూ. ఇరవై మూడు వేల కోట్ల అప్పు కావాలని ఇప్పటికే ఆర్బీఐకి ఇండెంట్ పెట్టారు. కానీ ఇంకా అనుమతిరాలేదు ఈ అనుమతి కోసం జగన్ ప్రధానంగా పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. మీడియాకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ జగన్ ఆర్థిక అంశాలపైనే మాట్లాడినట్లుగా ఉంది.
రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కిందని భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ పెద్దది, ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువని.. అందుకే లోటు పెరిగిపోయిందన్నారు. అప్పులు తీసుకోవడాన్ని కట్టడి చేయడాన్ని కూడా నిరోధించాలని 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఎన్బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని వినతిపత్రంలో కోరినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.