వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ… వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మనసు మెల్లగా ఏపీ వైపు లాగుతున్నట్లుగా కనిపిస్తోంది. కుటుంబపరమైన విభేదాలతో పాటు తెలంగాణలో ఎక్కడా స్పందన లేకపోవడంతో పాటు ఏపీ నుంచి కూడా ఆమె రావాలన్న ఒత్తిడి వస్తూండటంతో ఆమె అటు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్లో ని పార్టీ ఆఫీసులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను ఏపీలోపార్టీ ఏర్పాటుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. దీనికి షర్మిల స్పందించారు.
ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని… ఆంధ్రాలో పార్టీ పెట్టకూడదని రూలేం లేదుగా అని ప్రశ్నించారు. గతంలో ఏపీలో జగన్… తెలంగాణలో షర్మిల రాజకీయం చేస్తారని.. అలా ఒప్పందం కుదిరిదంన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ఒప్పందా ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకం విషయంలో సీరియ్ా లేరని అందుకే షర్మిల కూడా ఏపీలో పార్టీ దిశగా ఆలోచిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
త్వరలో ఆమె విశాఖపట్నంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ సమయంలో షర్మిల వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంలోకిఅడుగు పెట్టిన తర్వాత ఎవరికీ వదలాలని అనిపించదు. షర్మిలకు కూడాఅంతే . తనకు ఆదరణ లభిస్తుందని భావిస్తున్న ఏపీ వైపు ఆమె చూడటానికి అవకాశం ఉందని తెలుస్తోంది.