అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ఆగ్రహించడంతో ఇప్పుడు ప్రభుత్వం అవి గ్రామాలు కాదని …కార్పొరేషన్ అని కొత్త కబుర్లు చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అమరావతిని నగరపాలక సంస్థగా ప్రకటిస్తామని మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ గ్రామస్తులను కోరేందుకు గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాదలు రాజధాని ప్రాంత గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావని, మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంత ఏర్పాటు ప్రక్రియలో పలు లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పింది. గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలు తీర్మానాలు చేయకపోవడం వంటి లోపాలను సరిదిద్దాల్సి ఉందని తెలిపింది.
అప్పట్లో సీఆర్డీఏ రద్దు చేసి ఉన్నారు. ఇప్పుడు సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల కోణంలోనే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఇలాంటి ప్రజాభిప్రాయసేకరణకు తీవ్ర ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు తూ..తూ మంత్రంగా నిర్వహించినట్లుగా