ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ గురువారం ఉదయం 9గంటలకు మహారాష్ట్రలో ఎరవాడ సెంట్రల్ జైలు నుండి విడుదల కాబోతున్నారు. ఆయన 1993 మార్చి 12 ముంబై దాడుల కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు టాడా కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది. దానిపై సుదీర్ఘ విచారణ తరువాత సుప్రీం కోర్టు కూడా అ శిక్షను ఖరారు చేయడంతో ఆయన జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందు రిమాండ్ ఖైదీగా 18 నెలలు జైలులో గడిపినందున మిగిలిన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకొని ఫిబ్రవరి 25న జైలు నుండి విడుదలకాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు బారీ సంఖ్యలో ఎరవాడ చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు.