ఏపీ పట్ల కేసీఆర్ ఎన్ని చులకన వ్యాఖ్యలు చేస్తున్నా వైసీపీ మాత్రం ఆయనకు సపోర్ట్ చేసే కొద్దీ చేయాలనిపిస్తోంది. గతంలో పలుమార్లు కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగిన వైసీపీ అగ్రనేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో పరిపాలన బాగో లేదని తమను అక్కడ పార్టీ పెట్టమంటున్నారని నేరుగా చెప్పినా స్పందన నిల్. నిన్నటికి నిన్న ప్రెస్మీట్లో ఏపీ అసలు తెలంగాణతో పోల్చుకునేందుకు కూడా పనికి రాదని చెప్పడమే కాదు.. ఏపీలో క్లబ్లు, గంజాయి, గజానికింత అని వసూలు చేయడం వంటి వ్యవహారాలు ఉన్నాయని మా దగ్గర లేవని పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
వీటిని తేలిగ్గా తీసుకున్న వైసీపీ మఖ్య నేతలు.. కేసీఆర్కు ఏకపక్షంగా మద్దు ఇచ్చేందుకు మాత్రం క్షణం కూడా ఆలోచించలేదు. రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ సమర్థించింది. కేసీఆర్ మాటల్లో తప్పేమీ లేదని రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు సమంజసమేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చని.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చు దీనిపై చర్చ జరగాలన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఖరారు చేస్తూ ఉంటారు. ఆయన మాట అంటే వైఎస్ఆర్సీపీ మాట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయని తెలిసినా సజ్జల.. కేసీఆర్కు మద్దతివ్వడానికే ఆసక్తి చూపించడం వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.