ఇటీవల చిరంజీవికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. హోమ్ క్వారెంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. ఇప్పుడాయన పూర్తిగా కోలుకున్నారు. దాంతో పాటు షూటింగుల్నీ మొదలెట్టేస్తున్నారు. ఆయన చేతిలో `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్` చిత్రాలున్నాయి. ఈ రెండింటికీ ఆయన డేట్లు ఇచ్చారు.
ఈనెల 8 నుంచి `గాడ్ ఫాదర్` సెట్లో చిరు పాల్గోబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. సత్యదేవ్ తదితరులపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 8 నుంచి చిరు జాయిన్ అవుతారు. వారం రోజులు `గాడ్ ఫాదర్` సెట్లోనే ఉంటారు చిరు. ఆ తరవాత… `భోళా శంకర్`కి షిఫ్ట్ అవుతారు. చిరుకి కరోనా సోకడంతో.. భోళా శంకర్ షూటింగ్ మొత్తం ఆపేశారు. చిరు రాకతోనే షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. `గాడ్ ఫాదర్`లో సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. చివరి షెడ్యూల్లో సల్మాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.