ఉద్యోగ సంఘ నేతలు ఇప్పుడు ఉద్యోగులకు వివరణ ఇచ్చుకోవడానికి మొహమాట పడుతున్నారు. తమపై తీవ్ర విమర్శలు వస్తూండటంతో వారిని ఎలా కౌంటర్ చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో వారిపై సంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఈ నలుగురి నేతల చరిత్రను బయట పెడుతూ కథలు.. కథలుగా చెబుతున్నారు. వారు ప్రభుత్వం నుంచి ఏంపొందారో .. ఏంపొందబోతున్నారో వివరిస్తున్నారు. చర్చల పేరుతో సచివాలంయలో జరిగిన దృశ్యాలను కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్ష మవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఈ నలుగురి నేతలపై జరుగుతున్న ప్రచారంతో వారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఉద్యోగులు తమపై ఉన్న ఆగ్రహంతో .. తాము ఎందుకు సమ్మె విరమణ ప్రకటన చేశామో చెప్పుకునేందుకు మంగళవారం ప్రెస్మీట్ పెట్టాలనుకున్నారు. కానీ ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హాజరు కాలేదు. మిగతా ముగ్గురు తమ వాదన వినిపించవచ్చు. కానీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఉద్యమాన్ని సక్సెస్ చేసిన ఉపాధ్యాయులు సొంత కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారు.
అప్పుడు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలో ఆ నలుగురు తప్ప ఇంకెవరూ ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు ఆ నలుగుర్ని సొంత సభ్యులు కూడా నమ్మే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వ మద్దతు వారికి ఉంది కాబట్టి వారిపై తిరుగుబాటు లాంటివేమీ జరగకపోవచ్చు కానీ తర్వాత పరిస్థితి మారిపోతుందని ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది.