వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీకి గట్టి నమ్మకం ఏర్పడింది. జగన్ ఎప్పుడైనా నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఎన్నికలుక సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే చెబుతున్నారు. అంతే కాదు తమ పార్టీ పరంగా ఇప్పటికే అభ్యర్థులు ఎవరెవరు అన్న అంశంపై క్లారిటీ ఇస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్నదానికి ఓ ప్రాతిపదికను విశ్లేషకులు కొంత కాలంగా చెబుతున్నారు.
అదేమిటంటే ఆర్థికపరిస్థితి పూర్తిగా దిగజారిపోయిన సందర్భంలో జీతాలివ్వడమే కష్టంగా ఉంది..వచ్చే ఏడాది అప్పులు పుట్టని పరిస్థితి. అలాగే వివేకా హత్య కేసు ఎటు మలుపులు తిరిగి జగన్ మెడకు చుట్టుకుంటుందో అంచనా కూడా ఉంది. అలాగేఅధికార వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారం అందుకోవాలన్న ఆలోచన వైసీపీలో ఉందని జరుగుతున్నప్రచారంకూడా దీనికి కారణం. ఎప్పుడు పార్టీ నేతలతో సమావేశం జరిపినా ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సన్నద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు సూచిస్తూ ఉంటారు.
అయితే ఎన్నికల మూడ్ పెరుగుతున్న సమయంలో పార్టీ కార్యకర్లలను సన్నద్ధం చేయడానికి టీడీపీ నేతలు ్లా చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని అడుగుతున్నారు. కానీ సీఎం జగన్ నిర్ణయాలను తార్కికంగా విశ్లేషిస్తే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ట్రాక్ రికార్డు … ముందస్తు ఎన్నికలు అసాధ్యమేం కాదని అనుకోవచ్చు.