జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను యుద్ధం బాగా డిస్ట్రబ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఓ కొటేషన్‌ను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానని .. నూరవసారి మాత్రమే యుద్దం చేస్తానని” అందులో పేర్కొన్నారు. ఓ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్ కూర్చుని రాసుకుంటున్న కోణంలో పెన్సిల్ స్కెచ్ వేశారు . ఆ స్కెచ్ కిందనే పవన్ కొటేషన్ కూడా రాశారు. ఇది ఎవరో తత్వవేత్త చెప్పిన కొటేషన్‌లా ఉందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఆ మాటలు ఎవరన్నారో రాయలేదు కాబట్టి పవన్ ఆలోచనలేనని అనుకోవచ్చు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్కడి పరిస్థితులు అందర్నీ కలచి వేస్తున్నాయి. ఇండియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా అక్కడ చనిపోయారు. ఇది పవన్ కల్యాణ్‌ను బాగా డిస్ట్రబ్ చేసి ఉంటుందని అందుకే యుద్ధం గురించి అలా పెట్టారని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నోవా రష్యా జాతీయురాలు.
ఈ కారణంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన కలత చెంది ఉంటారని అందుకే ఇలా తన భావాలను వ్యక్తం చేశారని భావిస్తున్నారు. మరో వైపు ఏపీలోని పరిస్థితులు.. తన రాజకీయ పోరాటం గురించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ ట్వీట్లో అంతరార్థం ఏమిటో తెలియాలంటే పవన్ కల్యాణ్ చెప్పాల్సిందే.
— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2022