టాలీవుడ్ లో విడాకుల పరంపర నడుస్తుంది. నాగచైతన్య- సమంతల విడాకులు ఇంకా వార్తల్లోనే వుండగా మరో టాలీవుడ్ జంట డైవర్స్ కి సిద్దమౌతున్నట్టు తెలిసింది. కొన్నేళ్ళ క్రితం ఓ యూత్ ఫుల్ కాలేజీ మల్టీస్టారర్ లో ఓ పాత్ర పోషించి, తర్వాత కొన్నాళ్ళుకు సోలోగా విజయం అందుకుని తనకంటూ ఒక ఇమేజ్ ని సొంత చేసుకున్న హీరో.. 2020లో వివాహ బంధంలో ఆడుగుపెట్టాడు. ఏడాది పాటు సాఫీగానే సాగిన వీరి వివాహ బంధం ఇప్పుడు బీటలు వారిందని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
గత కొంత కాలంలో ఈ జంట కలసి లేరు. ఇరు కుటుంబాలు సర్ది చెప్పే ప్రయత్నం చేశాయి. అయితే ఇక విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేశార్ట. మొదట ఏవో చిన్న స్పర్ధలు అనుకున్నారు కుటుంబ సభ్యులు. అర్ధం చేసుకొని ఒక్కటౌతారని భావించారు. కానీ అలా జరగలేదు. మ్యచువల్ డైవర్స్ కి అప్లయ్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది ఆ జంట. గత కొన్నళ్ళుగా ఆ హీరో నుంచి సినిమా ప్రకటనలు లేవు. ఈ మధ్య అతని కెరీర్ కూడా నెమ్మదించింది. దీనికి కారణం .. వ్యక్తిగతంగా ఆ హీరో ఎదురుకుంటున్న సమస్యలేనని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అతి త్వరలో వీరిద్దరూ విడాకుల పోస్ట్ ని ఫ్యాన్స్ కు తెలియజేస్తారని సమాచారం.