”తనకు మరో జన్మ వుంటే మగాడిలా పుట్టాలని వుంది” అని చెప్పుకొచ్చింది రష్మిక . శర్వానంద్ తో కలసి రష్మిక నటించిన చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ళ కష్టాలు తనదైన శైలిలో చెప్పింది రష్మిక.
”పెళ్లి చూపుల పేరుతో ఆడవాళ్ళు పడే కష్టాలు ఈ సినిమాలో చూశా. నగలు , చీరలు, పవ్వులు .. ఇష్టం వున్న లేకున్నా అన్నీ అలకరించుకొని మగాడి ముందు తల దించుకొని కూర్చోవాలి. ఇలాంటి బాధలు చూశాక.. మరో జన్మ వుంటే మగాడిగా పుడితే బావున్ను అనిపిస్తుంది. కాలు మీద కాలేసుకొని, ప్రశ్నలు అడుగుతూ ఎంచక్కా కూర్చోవచ్చు”అని చెప్పింది. ఇక ఎలాంటి పెళ్లి కొడుకు కావాలని అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇంకా పెళ్లి గురించి అలోచించలేదు. పెళ్లి కొడుకు ఇలా వుండాలి, అలా వుండాలని లేదు. మంచి వాడైతే చాలు” అని తన మనసులో మాట పంచుకుంది రష్మిక.