తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. చాలా మందితో భేటీలు ఉంటాయని చెప్పారు కానీ చివరికి సుబ్రహ్మణ్యస్వామి, టికాయత్‌లతో మాత్రమే సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం హఠాత్తుగా ఆయన జార్ఖండ్ వెళ్లాలని నిర్ణియంచుకున్నారు. శుక్రవారం జార్ఖండ్ వెళ్తారు. చైనా సరిహద్దులోనీ గల్వాన వాలీ లో జరిగిన హింసాత్మక ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లకు గతంలో కేసీఆర్ నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు.
గల్వాన్ లోయలో చనిపోయిన జవాన్లలో ఇద్దరు జార్ఖండ్ వాసులు ఉన్నారు. వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు చేస్తారు. చైనా తో జరిగిన ఘర్షణ లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందారు. ఆయన కుటుంబానికి భారీ సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. అదే సందర్భంగా అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసిఆర్ ప్రకటించారు.
ఇప్పటి వరకూ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా జార్ఖండ్‌తో ప్రారంభిస్తారు. మరి మిగతా వారి సంగతేంటి అనే ప్రశ్న వస్తుంది.. అందుకే ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ చర్యలు చేపడతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సాయం చేయడానికి ఎన్నికల కోడ్ ఎలా అడ్డం అనేది అర్థం కానీ విషయమే అయినా… ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. మరి రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి ఎప్పుడు ఇస్తారో మరి !?