ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలు వైసీపీ సభ్యుల జగన్ స్తోత్రాలతో సింపుల్గా సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మళ్లీ సీఎంగానే సభలో అడుగు పెడతానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. ఆయన మళ్లీ సభలో అడుగు పెట్టే అవకాశం లేదు. ఎమ్మెల్యేలు మాత్రం సందర్భాన్ని బట్టి సభకు వెళ్లాలని తీర్మానించుకున్నారు.
బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై టీడీపీ హైకమాండ్ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. కానీ వెళ్లకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సభలో ఇష్టారీతిన బూతులు తిడుతూ అవమానించడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని.,. సభకు వెళ్లినా అలాంటి అవమానాలు పడాల్సిందే కానీ సభలో మట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వరని భావిస్తున్నారు. ప్రభుత్వ తీరును సభలో కన్నా బయటే ఎండగట్టడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు.
శాసనమండలికి కూడా టీడీపీ సభ్యులు వెళ్లే అవకాశం లేదు. గతంలో వైసీపీ నేతలు జగన్ పాదయాత్ర సందర్బంగా అందరూ బాయ్ కాట్ చేశారు. ఇప్పుడు టీడీపీ ఆ పని చేస్తోంది. ప్రతిపక్షం లేకుండా సమావేశాలు అనేది ఇటీవలి కాలంలో సహజం అయిపోతోంది.