ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందారు. తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ హార్ట్ ఎటాక్ కు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. షెన్ వార్న్ కు 52 ఏళ్ళు షేన్‌వార్న్ క్రికెట్ ప్రపంచంలో ఒక లెజెండ్. ఆస్ట్రేలియా అంటే అంతా ఫాస్ట్ బౌలర్లుహావా నడిచేది. కానీ వార్న్ మొత్తం క్రికెట్ ని తన స్పిన్ మాయాజాలంతో కనికట్టు చేశాడు. తన స్పిన్ గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేశాడు. వార్న్ వేసే మ్యాజిక్ బంతులు ఒకపట్టానా బ్యాట్స్ మ్యాన్స్ కు అర్ధమయ్యేవి కాదు. వార్న్ స్పిన్ అంటే భయపడే బ్యాట్స్ మెన్స్ కూడా వున్నారు. వార్న్ తన స్పిన్ మయాజాలంలో 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశారు. స్పిన్ తో బ్యాట్స్ మ్యాన్ ని బురిడి కొట్టించే వార్న్ కి సచిన్ బ్యాటింగ్ అంటే భయం. వార్న్ బౌలింగ్ లో సచిన్ వరుస ఫోర్లు కొట్టిన మ్యాచ్ తర్వాత తన కలలోకి వచ్చాడని కూడా ఓ సందర్భంలో చెప్పాడు వార్న్. ఇండియాతో వార్న్ కి మంచి అనుబంధం వుంది. ఐపీయల్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టుని విజేతగా నిలిపిన ట్రాక్ రికార్డ్ వార్న్ కి వుంది. తన స్పిన్ మాయాజాలంతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మాయ చేసిన వార్న్ .. హఠాన్మరణం క్రికెట్ ప్రపంచానికి దిగ్బ్రాంతి కలిగించింది.