తెలంగాణ మంత్రుల్లో శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు హాట్ టాపిక్. ఆయనకు కల్పించిన సెక్యూరిటీ కూడా ఇప్పుడు అదే రేంజ్‌కు చేరుకుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత అత్యధిక సెక్యూరిటీ ఉంది ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్‌కే. మాముగా మంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇటీవల ఆయనపై హత్యాయత్నానికి స్కెచ్ వేశారంటూ పోలీసులు బయట పెట్టడంతో సీఎం కేసీఆర్ సెక్యూరిటీ పెంచాలని ఆదేశించారు.
కేసీఆర్ ఆదేశాల ప్రకారం శ్రీనివాస్ గౌడ్ కు 20 మంది పోలీసులు, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆరుగురు ఇంటెలిజెన్స్ అధికారులు, నలుగురు గ్రేహౌండ్స్ కమాండోలతో భద్రత కల్పిస్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే గ్రేహౌండ్స్ కమాండోల భద్రత ఉండేది శ్రీనివాస్ గౌడ్‌కే. శ్రీనివాస్ గౌడ్ భద్రతాబృందంలోని పోలీసులకు ఎం44 ఆయుధాలు అందించనున్నారు. అంతేకాదు, మంత్రి కాన్వాయ్ లోకి అదనంగా మరో రెండు వాహనాలను పెంచారు.
శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నమే ఓ ఫ్యాబ్రికేటెడ్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతా పీకే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పోలీసుల ఇన్‌పుట్స్‌ను సీరియస్‌గా తీసుకుని సెక్యూరిటీ పెంచింది. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ పై మర్డర్ స్కెచ్ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది.