హైదరాబాద్: రాజమండ్రి పుష్కర ఘాట్ దుర్ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ఇవాళ రాజమండ్రిలో ఓదార్పు యాత్ర నిర్వహించి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. చంద్రబాబు తన పాపం నివృత్తి చేసుకోవడానికి కాశీకి వెళ్ళి గంగలో మునగాలని అన్నారు. వీఐపీ ఘాట్ ఉండగా, దాన్ని వదిలి ప్రచారంకోసం పుష్కర ఘాట్లో చంద్రబాబు స్నానం చేయటమేమిటని ప్రశ్ని్ంచారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తే ఎలాగంటూ ప్రశ్నించారు.