బండి సంజయ్ రెండో విడత పాదయాత్రను పధ్నాలుగో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆ రోజున అమిత్ షా వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన రావడం లేదని తేలిపోయింది. కొత మంది జాతీయ నేతలతో రెండో విడత పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదాయ్తర ముగింపు సభకు అమిత్ షా వస్తారని చెబుతున్నారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత పూర్తయింది.
ఆ విడత పూర్తయిన తర్వాత హుజురాబాద్లో భారీ గెలుపు లభించింది. రెండో విడత ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఇమేజ్ అమాంతం పెంచుకున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిని దాటి ముందుకెళ్తున్నారు. 14న అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద నుంచి రెండో విడత ప్రారంభిస్తారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఆ ఎన్నికల్లో గెలుపుతో బండి సంజయ్ ఇమేజ్ మరింత పెరిగింది.
రెండో విడత పాదయాత్రలో కేంద్రం ప్రతినిధులుగా ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందంచారు. అమిత్ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. అమిత్ షాటీం.. ప్రజా సంగ్రామ యాత్ర వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్ షా, నడ్డాలకు నివేదికలు పంపనుంది.