ఏపీ మంత్రి విడదల రజినిని అందరూ ఇప్పటి వరకూ చిలుకలూరిపేటలో పుట్టి పెరిగారని అనుకుంటున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుంది చిలుకలూరిపేట పురుషోత్తమపట్నంకు చెందిన కుమారస్వామి అనే కాపు కుటుంబానికి చెందిన వ్యక్తిని కానీ ఆమె పుట్టింది పెరిగింది హైదరాబాదే. ఆమె తల్లిదండ్రులు తెలంగాణకు చెందిన వారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామం విడదల రజిని తల్లిదండ్రుల స్వగ్రామం. ఆమె తండ్రి పేరు రాగుల సత్తయ్య. సత్తయ్య రెండో కూతురు రజిని.
రాగుల సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. రాగుల సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజని. చిలుకలూరిపేటకు చెందిన విడదల కుమారస్వామిని ఆమె వివాహం చేసుకున్నారు. రజని మంత్రి కావడంతో కొండాపురం గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. దీంతో విషయం బయటకు వచ్చింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు చెందిన ఒకరు ఏపీలో ఎమ్మెల్యేగా ఎన్నికవడం.. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనూహ్యమే. అయితే ఇలా తెలంగాణ వ్యక్తులు ఏపీ రాజకీయాల్లో ఉండటం అనూహ్యమేమీ కాదు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలంగాణకు చెందినవారే. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు.