ఆంధ్రప్రదేశ్లో హైందవ ధర్మానికి విఘాతం కల్పించే పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సామాన్య భక్తుల తొక్కిసలాట, అనంతర పరిణామాలపై ఎల్వీ స్పందించారు. టీటీడీ ఈవోగా సుదీర్ఘ కాలం పని చేసిన ఎల్వీ … ప్రస్తుత పాలకల మండలి భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోందన్నారు. భక్తుల తాకిడి ఎంతో ఎక్కువ ఉన్నా సమన్వయం చేసుకున్న చరిత్ర టీటీడీకి ుందన్నారు.తీవ్రమైన ఎండల్లో అన్నివేల మంది భక్తుల ఇబ్బందులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. టోకెన్లు ఉన్న వారినే కొండపైకి అనుమతించాలన్న ఏకపక్ష పోకడల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందన్నారు.
ప్రస్తుత పాలక మండలి సభ్యుల వ్యవహారశైలిపైనా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆక్షేపణ వ్యక్తం చేశారు. గతంలో పాలకమండలి చైర్మన్ ఎప్పుడో ఓ సారి వచ్చి దర్శనం చేసుకునేవారని ఇప్పుడు కొండపైనే తిష్ట వేస్తున్నారని.. వచ్చిన వీఐపీలు అందరికీ దగ్గరుండి దర్శనం చేయించి.. తామే దర్శనం చేయించామన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. అలాగే టీటీడీ సమావేశాలు శాసనసభ సమావేశాలు జరిగినట్లుగా జరుగుతున్నాయని.. 80 మందిని పెట్టుకుని బోర్డు సమావేశం ఎలా జరపగలరని ఎల్వీ ప్రశ్నించారు.
టీటీడీకి ప్రస్తుతం ఈవోగా జవహర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు ఉన్నాయి. దీంతో పదవికే టీటీడీ ఈవో. అన్ని వ్యవహారాలు జేఈవో ధర్మారెడ్డి చూసుకుంటూ ఉంటారు. టీటీడీ ఈవోను అదనపు బాధ్యతగా అప్పగించిన వ్యవహారంపైనా ఎల్వీ విమర్శలు గుప్పించారు. టీటీడీ ఈవో 24 గంటలూ పనిచేసినా సమయం సరిపోదని, అలాంటిది అదనపు బాధ్యతలుగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అలా నియమించిన వారిది అవగాహనా రాహిత్యమేనన్నారు. ఎన్నికల రాజకీయాలకు శ్రీవారిని వాడుకుంటారని గతంలో పింక్ డైమండ్ అన్నారని.. వచ్చే ఎన్నికలకు ముందు బ్లూ డైమండ్ అంటారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి స్వామి వారిని వివాదాల్లోకి దారుణమన్నారు.