జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని జూన్కువాయిదా వేసిన ప్రభుత్వం ఇప్పుడు సమయం దగ్గర పడుతూండటంతో ఆంక్షల పేరుతో హడావుడి ప్రారంభించింది. పన్నెండు రకాల షరతులు పూర్తి చేసిన వారికే పథకం వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో లబ్దిదారుల్లో హైరానా ప్రారంభమయింది. 75 శాతం హాజరు , కొత్త బియ్యం కార్డు , కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ వాడి ఉండాలి, తల్లి, విద్యార్తి ఒకే ఇంట్లో ఉండాలి, విద్యార్థి ఈకేవైసీ, వాలంటీర్ దగ్గర వివరాలు చెకింగ్, బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంచుకోవడం , బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లిం్ చేసుకోవడం.. ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవడం వంటివన్నీ చేయాలి.
బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలని..ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ అ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే ఎన్పీసీఐ చేయించుకోవాలని చేపించుకోవాలి. 12. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు ..ఒకవేళ తీసుకొని వుంటే వారిపై క్రిమినల్ కేసులు పెడతారు. చివరికి కొత్త జిల్లాల వారీగా ఆధార్ కార్డు మార్చుకోవాల్సి ఉంది. ఇన్ని షరతులు పూర్తి చేసిన వారికే అమ్మఒడి వస్తుంది. ఏ ఒక్కటి పెండింగ్లో ఉన్నా ఆశలు వదులుకోవాల్సిందే.
అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టడానికే ఇలాంటి షరతులు పెడుతున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రస్తుత లబ్దిదారుల్లో కనీసం ఇరవై ఐదు శాతం మందికి పథకాన్ని అనర్హులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు ప్రారంభించారు. లబ్దిదారుల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి.