ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బిజినెస్ మెన్ అని.. పెద్ద గ్యాంబ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్విడ్ ప్రో కో అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు డబ్బులు ఇచ్చాను. వాళ్లు నాకు ఓటు వేయాల్నట్లుగా జగన్ విధానం ఉందన్నారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనన్నారు. ఓటు వేస్తారు అనుకున్న వారికి మాత్రమే పథకాలు ఇస్తున్నారని ఉండవల్లి స్పష్టం చేస్తున్నారు. అయితే పథకాల పేరుతో ఇచ్చి పన్నుల పేరుతో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు.
పొరుగు రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవని.. ఏపీలో విపరీతంగా కరెంట్ కోతలున్నాయని… మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని జగన్ ఇలా తయారు చేశారన్నారు. విద్యుత్ కష్టాల నుంచి బయటపడటానికి ఎన్ని యుగాలు పడుతుందో చెప్పలేమన్నారు. ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదని.. జగన్ ఎంత కాలం ఇలా బటన్స్ కొట్టి డబ్బులు ఇవ్వగలరో తెలియదన్నారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. ఎ్నికలకు ముందు చంద్రబాబు పదివేలు పంచినా ఓట్లు వేయలేదన్నారు
కేంద్రం నిధుల మళ్లింపుపై విచారణ జరుగుతోందని.. విచారణలో ఫలితం ఏమొచ్చినా.. జగన్ ఏమీ ఫీల్ కారు. ఎందుకంటే.. పేద ప్రజలకు ఇచ్చానంటారన్నారు. జగన్‌కు ఎవరూచెప్పేవారు లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్ పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున డబ్బులు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మోదీని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు.