ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గాన్ని రెండో భార్యకు రాసిచ్చారని కొంత కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని బహిరంగం చేసేశారు. ఆమె కోసం పార్టీ కార్యాలయాన్ని ఉదయగిరిలో ప్రారంభించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య పేరు శాంత కుమారి. ఆమెకు వైసీపీ ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చి.. ఆమె కోసం మంచి ఏర్పాట్లు చేసి మరీ ఆఫీసు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మేకపాటి విచిత్రంగా ప్రవర్తించారు. ఆఫీసును ఒక సారి కాదు.. అనేక సార్లు ప్రారంభించారు. ఆఫీసులో ఉన్నప్రతీ వస్తువుకు రిబ్బన్ కట్టి ప్రారంభించారు. కుర్చీలు.. సోఫాలకు కూడా రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించారు. ఆయన తీరు చూసి వైసీపీ నేతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. రెండో భార్య ఒత్తిడితో ఆయన ఈ కార్యాలయం ప్రారంభించారని అంటున్నారు. ఇప్పటికే మేకపాటి కుటుంబ బాధలు పడలేక ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఆస్తి గొడవలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజకీయ వారసత్వం కూడా పోటీ పెరిగిపోయింది.
మరో వైపు నియోజకవర్గంలో ఇతర మండలాల్లోని వైసీపీ నేతలతో ఆయనకు సరిపడటం లేదు. ఓ వైపు కుటుంబం.. మరో వైపు పార్టీ నేతల అసంతృప్తి మధ్య మేకపాటి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. కానీ మేకపాటి మాత్రం తానుచేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైనా ఎదురొస్తే ఆయనకు తెలిసిన విద్య బూతులు తిట్టడం. ఆయన నోటిని ఎవరూ భరించలేరు. అందుకే అందరూ సైలెంట్‌గా ఉండిపోతున్నారు.