కడపలో సీబీఐ అధికారులను దుండగులు బెదిరిస్తున్నారు. కడప నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. తమకు వస్తున్న బెదిరింపుల గురించి సీబీఐ అధికారుల డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కడప సెంట్రల్ జైల్ నుంచి కేంద్ర కారాగారానికి వెళుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారని. కడప నుంచి వెళ్లిపోవాలంటూ వాహనంలో ఉన్న డ్రైవర్, అధికారులను కూడా బెదిరించారనితెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులు చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపైన వెంటనే స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరు బెదిరించారనే విషయంపై సీసీ ఫుటేజ్ పరిశీలన చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు సీబీఐ అధికారులు చాలా కాలంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నసీబీఐ అధికారులను .. గెస్ట్ హౌస్ ఖాళీ చేయమని ఓ సారి అధికారులు ఆదేశించారు. మరోసారి… సీబీఐ అధికారులపై ఓ అనుమానితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు కూడా నమోదు చేశారు. అయితే హైకోర్టు నుంచి సీబీఐ అధికారులు స్టే తెచ్చుకున్నారు.
ఇప్పుడు నేరుగా సీబీఐ అధికారులకే బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపుతోంది. అయితే అధికార పార్టీ వారే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉండటంతో పోలీసులు కూడా పెద్ద ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన అంశం కలకలం రేపుతోంది.