వేణు ఊడుగుల… ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పేరు. కానీ కొత్తతరం తెలుగు సాహిత్యం వేణు ఊడుగుల పేరు సుపరిచతమే. వేణు ఊడుగుల స్వతహాగా కవి. అతని కలంలో కవిత్వం పలుకుతుంది. ముఖ్యంగా విప్లవ కవిత్వం రాయడంలో వేణుది సెపరేట్ పంధా. ‘నీది నాది ఒకే కథ’లో ఆయన కలం కవిత్వం పలికించే అవకాశం రాలేదు. ఇప్పుడు రానాతో విరాటపర్వం చేస్తున్నాడు వేణు. ఈ సినిమాలో వేణు .. డైలాగ్స్ ని కూడా కవితల్లా మార్చాడని తెలుస్తుంది. ఇందులో రానా పాత్ర కవిత్వం రాస్తుంటుంది. ఆ కవిత్వానికి హీరోయిన్ సాయి పల్లవి, వెన్నెల పాత్ర ఆకర్షితురాలౌతుంది. అడవి, నక్సల్ నేపధ్యంలో వుండే విరాటపర్వంలో చాలా కవిత్వం వినిపిస్తుందని తెలిసింది. సాయి పల్లవి బర్త్ డే కానుగ విడుదలైన వీడియోలో కూడా పోయిట్రీగానే సాగింది.
”వెన్నెల రెండుసార్లు జన్మించింది
తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు
అడవి తల్లి ఒడిలో ఒకసారి
ఆశయాన్ని ఆయుధం చేసినట్టు
అతని ప్రేమలో మరొకసారి…
”నిర్బంధాలని కౌగలించుకున్న వసంతకాలం మనది.
రేపు మనం వున్నాలేకపోయిన చరిత్ర వుంటుంది, మన ప్రేమ కథని వినిపిస్తుంది
పైన మాటలు గమనిస్తే విరాటపర్వం ఎంత కవితాత్మకంగా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా జూలై 1 న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.