కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. జిల్లాకు పేరు మార్చమని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ఇలా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వందల మంది ఆందోళనకు దిగారు. కోన సీమ జిల్లానే కొనసాగించాలని వారుడిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ప్రజల ఆలోచనలేమిటో అర్థం చేసుకోకుండా పూర్తి స్థాయిలో రాజకీయ అవసరాల కోసం… తాత్కాలిక నిర్ణయాలతో కాలం గడపడమే ఈ దుస్థితికి కారణం.
కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంపై అమలాపురం జిల్లాలో రోజంతా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత పే్రు పెట్టాలనే ఉద్యమాలు జరిగాయి.. ఇప్పుడు కోనసీమ జిల్లా పేరునే ఉంచాలని ఉద్యమాలు వస్తున్నాయి. మొదటి సారే.. ప్రజలందరితో చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అన్నీ ఏకపక్షంగా.. రాజకీయ లెక్కలు వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్లే సమస్య వస్తోంది. దీన్ని రాజకీయ అవసరాల కోసం మరింత పెంచుతూ.. పాలకులే దుష్ట వ్యూహాలు అమలు చేస్తూండటంతో ప్రజలు నలిగిపోతున్నారు.
కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేయకుండా .. జిల్లాలు పేపర్ల మీద విభజించేయడం.. పైసా ఖర్చు లేని పనే కదా పేర్లు ఇష్టం వచ్చినట్లు పెట్టడం , మార్చడం లాంటి పనులు చేస్తూ.. కనీస ఆలోచన లేకుండా…బాధ్యత లేకుండా వ్యవహరిస్తూండటంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రజల మధ్య విద్వేషం ఏర్పడుతోంది. ప్రభుత్వాలు కనీస బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. అలాంటిది ఇప్పుడు మిస్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి.