ఆత్మకూరు ఉపఎన్నిక నామినేషన్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేశారు. కొంత మంది ఇండిపెండెంట్లు కూడా తమ పత్రాలు సమర్పించారు. టీడీపీ పోటీలో ఉండటం లేదని ప్రకటించింది. బీజేపీ తాము బరిలో ఉంటామని చెబుతోంది. అభ్యర్థిని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే జనసేన మాత్రమే ఈ అంశంపై చప్పుడు చేయడం లేదు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. బీజేపీ పోటీ చేస్తే మద్దతిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అసలు జనసేనతో మాట్లాడుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాల్సిన బీజేపీ అలాంటి మాటలే మాట్లాడకుండా… బీజేపీ అభ్యర్థి పేరుతోనే రాజకీయం చేస్తోంది. దీంతో జనసేన స్టాండ్ ఏమిటన్నది స్పష్టత లేకుండా పోయింది.
ఎమ్మెల్యే చనిపోతే.. వారి కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇస్తే పోటీ చేయకూడదనే ఓ విధానాన్ని గతంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చి చనిపోయిన భూమానాగిరెడ్డి .. కుమార్తె పోటీ చేస్తే.. వైసీపీ పోటీ చేసింది. అదే సమయంలో తిరుపతిలో సిట్టింగ్ ఎంపీ చనిపోతే.. వైసీపీ కుటుంసభ్యులకు టిక్కెట్ ఇవ్వలేదు. అక్కడ టీడీపీ పోటీ చేసింది. బ ద్వేలు ఎమ్మెల్యే చనిపోతే కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇచ్చారు. దాంతో టీడీపీ పోటీ చేయలేదు. జనసేన కూడా పోటీ చేయలేదు.
ఇప్పుడు ఆత్మకూరులోనే జనసేన అదే విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది. అయితే ఆ విషయాన్ని ఎందుకు నేరుగా చెప్పడం లేదని.. అధికారికంగా ప్రకటించాలి కదా అన్న సందేహం జనసైనికులకు కూడా వస్తోంది. బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ప్రకటించాలా.. వద్దా అన్నది తేల్చుకోలేని అంశంగా మారిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.