జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అవమానించేలా బీజేపీ వ్యవహరిస్తోంది. బీజేపీ-జనసేన పొత్తు ఉంటే.. ఆ పార్టీల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణే శిఖరంలా ఉంటారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో మరో రకమైన ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదంటున్నారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో సోము వీర్రాజు వంటి నేతలు పవన్ కల్యాణ్ తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. కానీ అనేక రకాల ఒత్తిళ్లు రావడంతో వెనక్కి తగ్గారు. సీఎం అభ్యర్థిని పార్టీ హైకమాండ్ ఖరారు చేస్తుందని ప్రకటించారు.
ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీలో సీఎం అభ్యర్థిపై చర్చ మరోసారి జరుగుతోంది. జనాదరణ అధికంగా ఉన్న నేత పవన్ కల్యాణ్ కాబట్టి .. బీజేపీ కన్నా ఎక్కువగా జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బీజేపీలోని కొంత మంది నేతలకు ఇది అసలు ఇష్టం లేదు. కొంత మంది సీఎం అయ్యాక తొలి సంతకాల గురించి కూడా మాట్లాడేస్తున్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.
అయితే మరో ప్రతిపాదన కూడ తెర మీదకు వచ్చినట్లుగా తెలు్సతోంది. ఏపీలో రెండు పార్టీలు కలసి పోటీ చేసి ఒక వేళ అధికారంలోకి వస్తే తొలి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పని చేసిన ఆ తరువాత మిగిలిన రెండు సంవత్సరాలు బీజేపి కి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని పార్టిలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని పై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడ బీజేపి నేతలు అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇలాంటి ఫిట్టింగ్‌లు పెట్టడం అంటే పవన్ ను అవమానించడమేనని.. పవన్ స్థాయి నేత బీజేపీలో ఒక్కరైనా ఉన్నారా అని జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.