ప్రభుత్వం బలహీనపడటం అంటే.. వ్యవస్థల్లో కొన్ని ఇతరులకు సహకరించడం. ఇప్పుడు తెలంగామలో అదే పరిస్థితి కనిపిస్తోంది. పబ్ గ్యాంగ్ రేప్ కేసులో బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. అవి బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుకు చేరాయి. ఎమ్మెల్యే కుమారుడ్ని పోలీసులు అధికారికంగా తప్పించేశారు. ఆయన రేప్ సమయంలో లేడని క్లీన్ చిట్ ఇచ్చేశారు. కానీ రఘునందన్ రావు .. ఆ బాలికను ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు.
ఇవి పోలీసుల దగ్గర నుంచే వెళ్లాయని ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. ఎందుకంటే.. నిందితులను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్నాయి అవి. అవే రఘునందన్ రావుకు చేరాయి. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కి పడ్డారు. వెంటనే ఎస్బీ, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ోల సమావేశమై… నిందితుల వీడియోలు, ఫొటోలు ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఎలా చేరాయన్నదానిపై ఆరా తీశారు.
ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కన్నా ఆధారాలు బయటకు వెళ్లడమే ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆగ్రహం తెప్పిస్తోంది. ఎమ్మెల్యే కొడుకుని ఇప్పటికే దుబాయ్ పంపించేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో వీడియోలు.. ఫోటోలు లీక్ చేయడం ద్వారా బీజేపీ అడ్వాంటేజ్ సాధించింది. అది ప్రజల్లో మాత్రమే కాదు.. ప్రభుత్వ వ్యవస్థల్లోనూ తమకు పట్టు చిక్కిందనే ఓ అభిప్రాయాన్ని బీజేపీ కల్పించగలిగింది. కీలకమైన పోలీసు శాఖలో బీజేపీ నేతలు తమ ప్రభావాన్ని చూపగలిగారంటే అది చిన్న విషయం కాదని రాజకీయవర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.